Monday, December 30, 2013

నూతన సంవత్సర శుభాకాంక్షలు  




బాల్యమిత్రులారా ప్లీజ్ ఒక క్షణం... 

నాలుగున్నర దశాబ్దాల క్రితం మనమందరం 

పాపం పుణ్యం ప్రపంచమార్గం ఏమీఎరగని బాలలం

శ్రీ బాపూజీ జిల్లా పరిషత్ పాఠశాల, మైలవరం

మనలను తీర్చిదిద్దిన ఒక పవిత్రమయిన దేవాలయం 

మన జీవితాలలో మైలవరం ఒక ప్రధానమయిన మజిలీ...

2012 సెప్టెంబర్ 23వ తేదీ మరపురాని ఒక అందమయిన మైలురాయి...

మన మైత్రికి, మన అనుబంధానికి ఇది ఒక పునాది...

మనమందరం కలిసి ఈ పునాదులమీద అందమయిన ఒక హర్మ్యం నిర్మించుదాం  

మనకు చేతనయినంత సాయం చేయటంద్వారా  మనుషులుగా మన రుణం తీర్చుకుందాం

ఆ దిశగా ఈ 2014 మనకందరికీ స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటూ....